'హనుమాన్‌' మూవీ టీజర్.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Hanuman Movie Teaser Date Announcement On November7. ప్రయోగాత్మక సినిమాలతో టాలీవుడ్‌లో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

By అంజి  Published on  4 Nov 2022 3:17 PM IST
హనుమాన్‌ మూవీ టీజర్.. రిలీజ్‌ ఎప్పుడంటే?

ప్రయోగాత్మక సినిమాలతో టాలీవుడ్‌లో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 'అ!', 'కల్కి', 'జాంబిరెడ్డి' వంటి ఇంట్రెస్టింగ్‌ సినిమాలు తెరకెక్కించిన ప్రశాంత్‌ వర్మ.. ఇప్పుడు 'హనుమాన్‌' అనే పాన్‌ ఇండియా సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా సూపర్‌ హీరో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. తేజా సజ్జా హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్‌ సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను సెట్‌ చేశాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి చిత్రయూనిట్‌ బిగ్‌ అప్‌డేట్‌ ప్రకటించింది.

దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఈ మూవీ టీజర్‌ రిలీజ్‌కు సంబంధించిన విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు. 'హనుమాన్‌' టీజర్‌ను నవంబర్‌ 7న విడుదల చేయనున్నట్లు తెలిపాడు. కాగా ఈ మూవీ టీజర్‌ దసరా కానుకగా రిలీజ్‌ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. కానీ 'ఆదిపురుష్' టీజర్‌ రావడంతో పోస్ట్‌ పోన్‌ చేయాల్సి వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ పాన్‌ ఇండియన్‌ సూపర్‌ హీరో మూవీగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో తేజ సజ్జాకు జోడీగా అమృత అయ్యర్‌ నటిస్తోంది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీ రోల్‌ ప్లే చేస్తోంది. డాక్టర్‌ ఫేం వినయ్‌రాయ్‌ విలన్‌ రోల్‌లో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.


Next Story