హనుమాన్ సినిమాను థియేటర్లలో ఎంత మంది చూశారో తెలుసా?

హనుమాన్ సినిమా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతూ ఉన్న సంగతి తెలిసిందే!! ఈ సినిమాను థియేటర్లలో కోటి మంది చూశారట.

By Medi Samrat  Published on  28 Jan 2024 3:00 PM GMT
హనుమాన్ సినిమాను థియేటర్లలో ఎంత మంది చూశారో తెలుసా?

హనుమాన్ సినిమా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతూ ఉన్న సంగతి తెలిసిందే!! ఈ సినిమాను థియేటర్లలో కోటి మంది చూశారట. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది. టాలీవుడ్‌లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ సంక్రాంతి గ్రాసర్‌గా దూసుకుపోతోంది. హనుమాన్ సినిమాను థియేటర్లలో కోటి మంది ప్రేక్షకులు చూశారట. ఈరోజు ఉదయం ఈ సినిమా ఏకంగా కోటి ఫుట్‌ఫాల్‌లను సాధించింది. ఈ చిత్రం ఇప్పటి వరకు ఒక కోటి మందికి పైగా ఫుట్‌ఫాల్స్‌ను సొంతం చేసుకుంది. ఇది పెద్ద చిత్రాలతో సహా ఏ చిత్రానికి అయినా భారీ మైలురాయి. త్వరలోనే ఈ చిత్రం 300 కోట్ల కలెక్షన్స్ ను సాధించేలా ఉంది. థియేటర్లలోకి వచ్చినప్పటి నుండి, భారతీయ సూపర్ హీరో చిత్రం హను-మాన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతోంది. తేజ సజ్జా- ప్రశాంత్ వర్మ కాంబినేషన్ భారీ విజయాన్ని అందుకుంది.

హనుమాన్ సినిమా 250 కోట్ల మార్క్‌ని సాధించగా.. ఈ ఘనత సాధించిన 5వ హీరోగా తేజా సజ్జా నిలిచాడు. తాజాగా హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల క్లబ్‌లో చేరాడు. 250Cr+ గ్రాస్ మార్క్ కలెక్ట్ చేసిన 9వ టాలీవుడ్ సినిమా ఇది.

హనుమాన్ సినిమాను థియేటర్లలో ఎంత మంది చూశారో తెలుసా?

బాహుబలి

బాహుబలి 2

సాహో

అలా వైకుంఠపురములో

పుష్ప

RRR

ఆదిపురుష్

సలార్

హనుమాన్

Next Story