టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ.. మొదటి సినిమా నుండే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ వెళుతున్నాడు. జాంబి రెడ్డి మూవీ తర్వాత యువ నటుడు తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబోలో వస్తోన్న సినిమా 'హనుమాన్'. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, టీజర్‌తో అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఓ విషయంలో ప్రశాంత్ వర్మ క్షమాపణలు కోరారు. రామాయణాన్ని పురాణం అన్నందుకు దయచేసి క్షమించండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్వీట్‌లో ప్రశాంత్ వర్మ రాస్తూ..'నా ప్రసంగంలో 'పురాణం' అనే పదాన్ని ఉపయోగించినందుకు దయచేసి క్షమించండి. రామాయణం మన చరిత్ర' అంటూ పోస్ట్ చేశారు.
ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మంచి విజువల్స్‌లో ఆసక్తికరంగానే కాకుండా టీజర్ క్వాలిటీ బాగుంది. తేజ సజ్జా హీరోగా నటించగా.. ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా కనిపించనుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలకపాత్రలో ఆకట్టుకోనుంది. హను మాన్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనుంది టీమ్. ఇక ఈ సినిమాకు కెమెరామన్ శివేంద్ర కెమెరా, గౌరహరి సంగీతం అందించారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించింది చిత్రబృందం. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.