హనుమాన్ సెన్సార్ రిపోర్ట్.. రన్ టైమ్ వచ్చేసాయి
ఈ సంక్రాంతికి థియేటర్లలో రానున్న మరో సినిమా హనుమాన్. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.
By Medi Samrat Published on 29 Dec 2023 10:00 AM GMTఈ సంక్రాంతికి థియేటర్లలో రానున్న మరో సినిమా హనుమాన్. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక హనుమాన్ సెన్సార్ రిపోర్ట్, రన్ టైమ్ వివరాలు బయటకు వచ్చాయి. హనుమాన్ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో తొలి సూపర్ హీరో చిత్రంగా నిలిచిన ఈ చిత్రంలో తేజ సజ్జ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సినిమా టీజర్, పాటలు, ట్రైలర్ కారణంగా సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి.
ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘హనుమాన్’ జనవరి 12, 2024న విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. హనుమాన్ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ సెన్సార్ రేటింగ్‌ను అధికారికంగా వెల్లడించింది. యు/ఎ రేటింగ్‌తో కొత్త పోస్టర్ కూడా విడుదలైంది. చిరుతపులి నుంచి జింకను రక్షించేందుకు హీరో పరిగెడుతున్నట్లు పోస్టర్‌లో ఉంది. ఈ సినిమా రన్‌టైమ్ 158 నిమిషాలు (2 గంటల 38 నిమిషాలు) అని తెలుస్తోంది. హనుమాన్ సినిమాలో హనుమంతుడి వల్ల అతీంద్రియ శక్తులను పొందే యువకుడి పాత్రలో తేజ సజ్జ నటించాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 12, 2024న విడుదల చేయాలనుకుంటున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, జపనీస్, చైనీస్ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, రాజదీపక్ శెట్టి, సముద్రఖని, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో హనుమాన్ మొదటి సినిమా అని చెబుతున్నారు.