అక్కడ కేజీఎఫ్ రికార్డును బద్దలుకొట్టిన హనుమాన్
హనుమాన్ సినిమా బాక్సాఫీసు వద్ద వండర్స్ చేస్తూ ఉంది. హనుమాన్ హిందీ మార్కెట్లలో KGF సినిమా కలెక్షన్స్ ను బద్దలు కొట్టారు
By Medi Samrat Published on 29 Jan 2024 3:37 PM GMTహనుమాన్ సినిమా బాక్సాఫీసు వద్ద వండర్స్ చేస్తూ ఉంది. హనుమాన్ హిందీ మార్కెట్లలో KGF సినిమా కలెక్షన్స్ ను బద్దలు కొట్టారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ నటించిన ఈ భారతీయ సూపర్ హీరో చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. జనవరి 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ కలెక్షన్లలో 250 కోట్ల రూపాయల మార్కును దాటేసింది. ఇక ఈ సినిమా హిందీ వెర్షన్ ఇప్పుడు 44.44 కోట్లు వసూలు చేసింది. KGF చాప్టర్ 1 హిందీ మార్కెట్లలో 44 కోట్ల నెట్ వసూలు చేసింది. హనుమాన్ 17 రోజుల్లో ఆ సంఖ్యలను దాటేసింది. హనుమాన్ సినిమా ఇప్పుడు హిందీ మార్కెట్‌లలో ఆల్ టైమ్ 10వ అతిపెద్ద సౌత్ ఇండియన్ గ్రాసర్‌గా అవతరించింది. 50 కోట్ల నెట్ మార్క్ వైపు హనుమాన్ సినిమా దూసుకుపోతూ ఉంది.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ఫీట్ సాధించింది. సినిమా థియేట్రికల్ బిజినెస్ జరిగిన తరువాత కేవలం తెలుగు రాష్ట్రాల థియేటర్ల నుంచే 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన నాలుగవ సినిమాగా నిలిచింది. అది కూడా నాన్ రాజమౌళి సినిమాల్లో మొదటి సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ మాత్రమే ఆ లిస్టులో ఉండేవి. ఇప్పుడు హనుమాన్ ఆ లిస్టులో చేరింది. ఈ సినిమా రిలీజ్ అయి 15 రోజులలోనే రూ. 250 కోట్ల కలెక్షన్లను సాధించినట్లు మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేశారు. హనుమాన్ మూవీలో హీరో తేజ సజ్జతో పాటు అమృతా అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.