దూసుకుపోతున్న హనుమాన్.. ఇప్పుడు ఏ నెంబర్ దగ్గర ఉన్నాడంటే.?

‘హనుమాన్’ సినిమా మొద‌టిరోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తుంది.

By Medi Samrat  Published on  27 Jan 2024 3:15 PM IST
దూసుకుపోతున్న హనుమాన్.. ఇప్పుడు ఏ నెంబర్ దగ్గర ఉన్నాడంటే.?

‘హనుమాన్’ సినిమా మొద‌టిరోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తుంది. ఈ చిత్రం 17 రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.250 కోట్ల మార్కును అందుకుంది. టాలీవుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ‘హనుమాన్’ కు ప్రీమియర్ల నుండి హిట్ స్టేటస్ ను దక్కించుకుంది. తేజ సజ్జా, అమృత అయ్యర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం అంచనాలకు మించి బాక్సాఫీసు దగ్గర కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. వరలక్ష్మి శరత్ కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి గౌరా హరి-అనుదీప్ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ సంయుక్తంగా మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందించారు.

సినిమా తెలుగు రాష్ట్రాల్లో 15వ రోజు అంచనాలకు మించి 5.33 కోట్ల కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. టాలీవుడ్ చరిత్రలో 15వ రోజు ఆల్ టైం హైయెస్ట్ షేర్ తో ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15వ రోజు వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో 9.48 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 20.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది సినిమా.

Next Story