'గుంటూరు కారం' సెకండ్ సింగిల్.. రిలీజ్ డేట్ ఫిక్స్..!
సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి తదితరులు నటిస్తున్న చిత్రం 'గుంటూరు కారం'.
By Medi Samrat
సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి తదితరులు నటిస్తున్న చిత్రం 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాలోని 'దమ్ మసాలా' సాంగ్ సూపర్ సక్సెస్ అయ్యింది. దమ్ మసాలా పాట విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. పాటను సంజిత్ హెగ్డే, థమన్ పాడగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.
Here’s the true WWM poster ❤️🔥
— Guntur Kaaram (@GunturKaaram) December 9, 2023
🔗 https://t.co/bCOQ6cjK4G
Get ready to taste the sweet spice ❤️#GunturKaaram 2nd single #OhMyBaby promo on Dec11 4:05pm 🔥
Full song on Dec13 🎶@urstrulymahesh #GunturKaaramOnJan12th 🌶️ pic.twitter.com/3N8fkSvdZK
ఇప్పుడు గుంటూరు కారం నుండి మరో పాట రాబోతోంది. ఈ చిత్రం నుంచి రెండో పాట విడుదలకు రంగం సిద్ధమైందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 11న సాయంత్రం 4.05 గంటలకు 'ఓ మై బేబీ' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ప్రోమో రిలీజ్ కానుంది. పూర్తి పాటను డిసెంబరు 13న విడుదల చేయనున్నారు. 'గుంటూరు కారం' చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ నటులు సునీల్, అజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రఘుబాబు వంటి వారు ఇందులో ముఖ్య పాత్రలు చేస్తున్నారు.