మరోసారి 'గుంటూరు కారం' టీమ్ కు షాక్

టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలను లీకులు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Nov 2023 5:41 PM IST
మరోసారి గుంటూరు కారం టీమ్ కు షాక్

టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలను లీకులు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. గతంలో ఎన్నో సినిమాలకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వగా.. ఇప్పుడు మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు కూడా ఊహించని కష్టాలు వస్తున్నాయి. గుంటూరు కారం షూటింగ్ సన్నివేశాలు మళ్లీ లీక్ అయ్యాయి. సినిమాకు సంబంధించిన సన్నివేశాలు, ఫుటేజీలు లీక్ కావడం ఇదే తొలిసారి కాదు. ఈ సినిమా మొదటి సింగిల్ 'దమ్ మసాలా' కు సంబంధించిన డ్యాన్స్ బిట్ లీక్ చేశారు. ఇప్పుడు ఓ సన్నివేశంలోని కొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

మహేష్ బాబు కొత్త చిత్రం ‘గుంటూరు కారం’ మీద అభిమానులకు మంచి హోప్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ‘దమ్ మసాలా’ పాటతో అభిమానులలో ఉత్కంఠ పెరిగిపోయింది. బాబు ఫుల్ మాస్ గా కనిపిస్తూ ఉన్నాడు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌తో మహేష్‌బాబు మూడోసారి కలిసి చేస్తున్న సినిమా ఇది. అందుకే గుంటూరు కారం బృందం లీకేజీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఇలాంటి లీకేజీలు ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతూ ఉన్నారు.

Next Story