గుంటూరు కారం ఓటీటీ వివరాలు ఇవే.!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా డిజిటల్ ప్రీమియర్ రాబోతోంది.

By Medi Samrat  Published on  8 Feb 2024 9:30 PM IST
గుంటూరు కారం ఓటీటీ వివరాలు ఇవే.!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా డిజిటల్ ప్రీమియర్ రాబోతోంది. ఈ చిత్రం సంక్రాతికి విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 114.3 కోట్ల ముగింపు షేర్‌ సాధించింది. గుంటూరు కారం సినిమాను ఫిబ్రవరి 9 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయనున్నారు. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల చేశారు.

ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను మహేష్ బాబు కెరీర్‌లోనే రికార్డు ధరకు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. స్ట్రీమింగ్ డీల్ ప్రకారం, సినిమా థియేట్రికల్ రిలీజ్ అయిన 4 వారాల తర్వాత స్ట్రీమ్ చేయడానికి షెడ్యూల్ చేశారు. నెట్‌ఫ్లిక్స్ బృందం 4 వారాలలో స్ట్రీమింగ్‌ డేట్ ను ప్రకటించింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్, మీనాక్షి చౌదరి తదితరులు నటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు.

Next Story