'కుర్చీ మడత పెట్టి' పాటపై ఆ తాత స్పందించాడు..!

మహేష్ బాబు హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది

By Medi Samrat  Published on  30 Dec 2023 10:44 AM IST
కుర్చీ మడత పెట్టి పాటపై ఆ తాత స్పందించాడు..!

మహేష్ బాబు హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పనులు మొదలుపెట్టారు మేకర్స్. తాజాగా కుర్చీని మడతపెట్టి అనే ఊర మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక సాంగ్ లో మహేష్, శ్రీలీల మాస్ స్టెప్స్ పీక్స్ లో ఉన్నాయి. ఈ కుర్చీ మడత అనేది సోషల్ మీడియాలో ఒక తాత కారణంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే!! కుర్చీ తాత చెప్పిన ఈ డైలాగ్ సోషల్ మీడియాలో ఎంతో ట్రెండ్ అయింది.


తన డైలాగ్ ను మహేష్ సినిమాలో పాటగా వాడటంపై కుర్చీ తాత స్పందించారు. మహేష్ బాబు లాంటి పెద్ద హీరో సినిమాలో నా డైలాగ్ ను పాటగా చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అవకాశం ఇస్తే నాకు ఆ పాటలో డ్యాన్స్ చేయాలని ఉందని.. ఇది నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నానని తెలిపారు. ఇక నాకు డైలాగ్ ను వాడుకోవడంపై సంగీత దర్శకుడు తమన్ నన్ను పిలిచి నా డైలాగ్ వాడుతున్నామని చెప్పడమే కాక.. ఆర్థిక సాయం కూడా అందించారన్నారు కుర్చీ తాత.

ఒక వర్గం ప్రజలు, కుర్చీ మడత పెట్టి గురించి చాలా ఆనందించారు. ఇంకో వర్గం ప్రజలు ఖలేజా, అతడు వంటి అద్భుతమైన చిత్రాలను నిర్మించిన త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబోలో ఇలాంటి బూతు కంటెంట్ రావడం భయంగా ఉందని.. ఊహించలేమని అన్నారు. బాక్సాఫీస్ పరంగా ఈ పాటను మాస్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని మాత్రం చెప్పొచ్చు. డిసెంబర్ 30న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు లిరికల్ సాంగ్ ను విడుదల చేయనున్నారు.

Next Story