అన్‌స్టాపబుల్‌-2 రెండో ఎపిసోడ్ గెస్టులెవరో గెస్‌ చేయండి

Guess who will be the guests of Unstoppable-2 episode 2. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్‌ రెండో సీజన్‌ మొదటి ఎపిసోడ్

By Medi Samrat  Published on  15 Oct 2022 6:45 PM IST
అన్‌స్టాపబుల్‌-2 రెండో ఎపిసోడ్ గెస్టులెవరో గెస్‌ చేయండి

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్‌ రెండో సీజన్‌ మొదటి ఎపిసోడ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే..! మొదటి ఎపిసోడ్ లో బాలయ్య తన వియ్యంకుడు, టీడపీ అధినేత చంద్రబాబు నాయుడు, అతని కుమారుడు నారా లోకేశ్‌లతో జరిగిన మొదటి ఎపిసోడ్‌ ఆకట్టుకుంది. మొదటి ఎపిసోడ్‌ పూర్తవ్వగానే.. ఫ్యాన్స్ తర్వాతి ఎపిసోడ్ లో ఎవరొస్తారో చెప్పండంటూ ఆహాను అడుగుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆహా యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ షేర్‌ చేసింది. 'గెస్‌ ది గెస్ట్ ఆఫ్‌ ఎపిసోడ్‌-2' అంటూ తర్వాతి ఎపిసోడ్‌కు వచ్చే గెస్టులెవరో గెస్‌ చేయండంటూ రెండు పజిల్స్‌ను షేర్‌ చేసింది ఆహా యాజమాన్యం. అశోకవనంలో అర్జున కల్యాణంతో ఆకట్టుకున్న హీరో విశ్వక్ సేన్, సిద్దూ జొన్నల గడ్డ వస్తున్నారని మరికొందరు చెబుతున్నారు.

Are you ready for a crazyy Unstoppable episodee up next??😃

Drop your guesses on guests in the comments below 👇

#UnstoppableWithNBKS2

#NandamuriBalakrishna అంటూ ఆహా సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.


Next Story