'దేవర' సినిమా రిలీజ్ రోజు ఆరు 'షో' లకు.. టికెట్‌ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన‌ 'దేవర' సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతినిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది

By Medi Samrat  Published on  21 Sep 2024 8:43 AM GMT
దేవర సినిమా రిలీజ్ రోజు ఆరు షో లకు.. టికెట్‌ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్


జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన‌ 'దేవర' సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతినిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్లపై రూ.135 వరకూ.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్ పై రూ.110.. లోయర్ క్లాస్ ఒక్కో టికెటైపై రూ.60 వరకూ పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. దేవర సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుండ‌గా.. ఆ రోజు అర్థ‌రాత్రి 12AM నుంచి మొత్తం 6 షో లకు అనుమతి ఇస్తున్నట్లు వెల్ల‌డించింది. అలాగే 28వ తేదీ నుంచి 9 రోజులపాటు రోజుకు 5షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

టికెట్ల ధరల పెంపునకు అనుమతినిచ్చిన‌ ప్ర‌భుత్వానికి హీరో ఎన్టీఆర్, నిర్మాత‌ కళ్యాణ్ రామ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఎన్టీఆర్ తన ట్వీట్ లో.. దేవర రిలీజ్ కోసం కొత్త జీవో పాస్ చేసినందుకు.. మాకు సపోర్ట్ గా నిలిచినందుకు, తెలుగు సినిమాకు ఎప్పుడూ సపోర్ట్ గా నిలుస్తున్నందుకు సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Next Story