ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన గోవింద
బాలీవుడ్ నటుడు గోవింద కాలికి గాయమైన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 4 Oct 2024 2:26 PM ISTబాలీవుడ్ నటుడు గోవింద కాలికి గాయమైన సంగతి తెలిసిందే. ఆయన స్వంత లైసెన్స్ రివాల్వర్ మిస్ ఫైర్ కావడంతో గోవిందను ఆసుపత్రిలో చేర్చారు. మూడు రోజుల తర్వాత ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత గోవింద తన చేతులు జోడించి అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తన కోసం ప్రార్థనలు చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరి దయ, ఆశీస్సుల వల్ల నేను క్షేమంగా ఉన్నాను అని గోవింద అన్నారు.
బయటకు వచ్చిన ఆనందం గోవిందం ముఖంలో స్పష్టంగా కనిపించింది. గోవింద మాట్లాడుతూ, "ప్రతి ఒక్కరి ప్రార్థనలకు, శుభాకాంక్షలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా కోసం ఇంతగా ప్రార్థించినందుకు నా అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వారి ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు.
మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు గోవింద తన లైసెన్స్ రివాల్వర్‌ను శుభ్రం చేస్తున్నాడు. గోవింద తన రివాల్వర్‌ను అల్మారాలో పెడుతుండగా.. అది ఒక్కసారిగా అతని చేతిలోంచి జారి కిందపడింది. ఆ సమయంలోనే రివాల్వర్ మిస్ ఫైర్ కావడంతో గోవింద కాలికి గాయమైంది. ఆ సమయంలో గోవింద భార్య ఇంట్లో లేదు. సహాయకులు వెంటనే ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. బుల్లెట్ గాయం గురించి గోవింద మేనేజర్ సమాచారం అందించారు.