ఆకట్టుకుంటున్న రష్మిక, అమితాబ్ బచ్చన్ గుడ్ బై ట్రైలర్

Goodbye Trailer Released. మంగళవారం ఉదయం విడుదలైన 'గుడ్‌బై' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. భావోద్వేగాలతో కూడిన ఈ సినిమా ట్రైలర్

By Medi Samrat
Published on : 6 Sept 2022 9:00 PM IST

ఆకట్టుకుంటున్న రష్మిక, అమితాబ్ బచ్చన్ గుడ్ బై ట్రైలర్

మంగళవారం ఉదయం విడుదలైన 'గుడ్‌బై' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. భావోద్వేగాలతో కూడిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. దుఃఖం, ప్రేమ, లాజిక్, మన సంప్రదాయాలు, హాస్యం.. ఇలా అన్నీ ఉన్నట్లు తెలుస్తోంది. ట్రయిలర్ లో రష్మిక పాత్ర తన తల్లిదండ్రులకు (అమితాబ్ బచ్చన్ మరియు నీనా గుప్తా పోషించిన పాత్ర) ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా స్వతంత్రంగా ఉండటానికి తన ఇంటి నుండి బయటకు రావాలని కోరుకుంటున్నట్లు చెబుతుంది. ఆ తర్వాత రష్మిక తన తల్లి చనిపోయిందని తెలుసుకుంటుంది. రష్మిక ఇంటికి వెళ్ళినప్పుడు.. ఆమె కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి చేరుకున్నప్పుడు ఏమి జరిగిందా..? అన్నదే సినిమా కథ. తన తల్లి కోరినట్లుగా అంత్యక్రియలను జరిపించారా లేదా అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది.


"A part of our Goodbye baby is now yours... This one is special for so many reasons but for now I hope you and your family like this." అంటూ రష్మిక తన సోషల్ మీడియా ఖాతాలో సినిమా ట్రైలర్ ను షేర్ చేసింది. వికాస్ భల్ దర్శకత్వం వహించిన గుడ్‌బై చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సరస్వతి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, విరాజ్ సావంత్ నిర్మించారు. అక్టోబర్ 7న థియేటర్లలో సినిమా విడుదల కానుంది.




Next Story