పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న హరి హర వీరమల్లు సినిమాలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఈ సినిమా నుంచి మాట వినాలి లిరికల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు పెంచలదాస్ సాహిత్యాన్ని అందించారు. పవన్‌కల్యాణ్ ఈ పాటను ఆలపించడంతో మరో విశేషంగా నిలిచింది. బ్రిటీషర్స్ మీద పోరాటం చేసిన తెలంగాణ బిడ్డ హరి హర వీరమల్లు గాథగా క్రిష్ జాగర్లముడి, జ్యోతి కృష్ణ ఈ మూవీ తెరకెక్కించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇది వరకే ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ కాగా ఇప్పుడు ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజైంది. దీంతో ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ మార్చి 28వ తేదీన ఐదు భాషల్లో రిలీజ్ కాబోతుంది.