ఓటీటీ అభిమానులకు గుడ్ న్యూస్

ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్. కొన్ని క్రేజీ సినిమాలు ఓటీటీలో అందుబాటులోకి రానున్నాయి.

By -  Medi Samrat
Published on : 12 March 2026 5:40 PM IST

ఓటీటీ అభిమానులకు గుడ్ న్యూస్

ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్. కొన్ని క్రేజీ సినిమాలు ఓటీటీలో అందుబాటులోకి రానున్నాయి. రవితేజ నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' స్ట్రీమింగ్‌లోకి రానుంది. మార్చి 13, 2026 నుండి ZEE5లో అందుబాటులో ఉండనుంది. ప్రైమ్ వీడియోలో కపుల్ ఫ్రెండ్లీ, నెట్‌ఫ్లిక్స్‌లో ఫంకీ సినిమాలు కూడా ఈ రాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతున్నాయి.

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన సినిమా. ఈ చిత్రంలో రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి నటించారు. SLV సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి కలెక్షన్స్ ను అందుకుంది.

కపుల్ ఫ్రెండ్లీ (2026) సినిమా అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం. ఈ చిత్రంలో సంతోష్ శోభన్, మానస వారణాసి నటించారు. చెన్నైలో కెరీర్లు, లివింగ్-ఇన్ సంబంధాలను ఈ సినిమాలో చూపించారు.

Next Story