అదిరేలా 'గాడ్ ఫాదర్' టీజర్..!
GodFather Teaser. ఒక సినిమాను రీమేక్ చేయాలంటే చాలా ఆలోచించాల్సి ఉంటుంది.
By Medi Samrat Published on 21 Aug 2022 7:39 PM ISTఒక సినిమాను రీమేక్ చేయాలంటే చాలా ఆలోచించాల్సి ఉంటుంది. అదే సినిమా తెలుగులో డబ్ అయి.. ఓటీటీలో కూడా అందుబాటులో ఉంటే..! ఆ సినిమాను రీమేక్ చేయడం చాలా కష్టం. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం అందుకు సంబంధించి చాలా ప్లానింగ్ చేశారు. పక్కా ప్రణాళికతో మోహన్ లాల్ మలయాళం బ్లాక్ బస్టర్ 'గాడ్ ఫాదర్' ను రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ కథకు చాలా మార్పులే చేశారని తాజాగా విడుదల చేసిన టీజర్ ను చూస్తుంటే మనకు అర్థమవుతోంది.
ఓ వైపు సమస్యను చూపిస్తూ.. ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ఆరు సంవత్సరాల తర్వాత వచ్చే గాడ్ ఫాదర్ జీవితంలో ఎన్ని మలుపులు ఉన్నాయనేది స్పష్టంగా గాడ్ ఫాదర్ టీజర్ లో చూపించారు. తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇక ఆఖర్లో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ స్పెషల్ ఎంట్రీ కూడా ఊపు తెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా విడుదలైన గాడ్ ఫాదర్ టీజర్ అందరినీ ఆకట్టుకుంటూ ఉంది. మలయాళంలో మోహన్ లాల్ చేసిన 'లూసిఫర్' సినిమాకి ఇది రీమేక్. ఆర్ బీ చౌదరి - ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.