'నాకు అబార్షన్‌ చేయించాడు'.. రాజ్‌తరుణ్‌పై ప్రియురాలు సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌: సినీ నటుడు రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య మరోసారి పోలీసులను ఆశ్రయించారు.

By అంజి  Published on  10 July 2024 7:43 AM GMT
Hyderabad, Tollywood, Rajtarun, Narsingi

'నాకు అబార్షన్‌ చేయించాడు'.. రాజ్‌తరుణ్‌పై ప్రియురాలు సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌: సినీ నటుడు రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య మరోసారి పోలీసులను ఆశ్రయించారు. లావణ్య ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి చక్కర్లు కొడుతుంది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ మరోసారి లావణ్య పోలీసులను ఆశ్రయించింది. హీరో రాజ్‌ తరుణ్‌తో తనకు పదేళ్ల క్రితమే పెళ్లి అయ్యిందని, తామిద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నామని లావణ్య తెలిపింది. పదేళ్లుగా తాము కాపురం చేస్తున్నామని చెప్పారు. కొన్నాళ్ల క్రితం రాజ్‌ తరుణ్‌ తనకు కూడా అబార్షన్‌ చేయించాడని వివరించింది.

అబార్షన్‌ చేయించిన మెడికల్‌ డాక్యుమెంట్స్‌, ఆస్పత్రి వివరాలు అన్నీ కూడా లావణ్య పోలీసులకు సమర్పించింది. లావణ్య అలియాస్‌ అన్విక పేరుతో కలిసున్నామని లావణ్య తెలిపింది. అన్విక పేరుతో విదేశాలకు కూడా ఇద్దరం కలిసే వెళ్లామని చెప్పారు. పది సంవత్సరాలుగా ఇద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నామని... ఇప్పుడు హీరోయిన్ మాల్వీ వచ్చిన తర్వాత రాజ్‌ తరుణ్ తనను దూరం పెట్టారని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది.మాల్వీ కోసం రాజ్‌తరుణ్‌ ముంబైకు వెళ్లడంతో ప్రశ్నించానని, రాజ్‌ తరుణ్‌ను నిలదీయడంతో తనను దూరం పెట్టాడని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది.

Next Story