అఖిల్ అక్కినేని హీరోగా నటించిన హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధంగా ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య ప్రధాన పాత్రలో, ప్రముఖ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో, బాలీవుడ్ నటుడు డినో మోరియా విలన్‌గా నటించారు.
‘ఏజెంట్’ ప్రతిష్టాత్మకమైన RAW ఏజెంట్ రికీ కథకు సంబంధించింది. 2023 వేసవిలో అఖిల్ ఏజెంట్ భారీ అంచనాలతో విడుదలైంది. ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అయితే, ఈ చిత్రం OTT విడుదల సినీ ప్రేక్షకులకు చర్చనీయాంశంగా మారింది. చివరకు, అఖిల్ ఏజెంట్ OTTలోకి వస్తోంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను సోనీ లివ్ కొనుగోలు చేసింది, కానీ ఆర్థికపరమైన సమస్యల కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు అక్కినేని అభిమానుల నిరీక్షణ ముగిసింది. ఈ చిత్రం మార్చి 14 నుండి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుందని సోనీ లివ్ అధికారిక ప్రకటన తెలిపింది.