బిగ్‌బాస్ 'ఫ్యాషన్ షో'లో గెలిచిన '‌రూ. లక్ష'తో గంగవ్వ ఏం కొనిందో తెలుసా.?

Gangavva Bought Gold Using BiggBoss Check. బిగ్‌బాస్ సీజన్ ఫోర్ 19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే

By Medi Samrat  Published on  18 Dec 2020 12:19 PM GMT
బిగ్‌బాస్ ఫ్యాషన్ షోలో గెలిచిన ‌రూ. లక్షతో గంగవ్వ ఏం కొనిందో తెలుసా.?

బిగ్‌బాస్ సీజన్ ఫోర్ 19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే. ఈ 19 మంది కంటెస్టెంట్ లో యూట్యూబ్ స్టార్ గంగవ్వ ఉండటం ఎంతో విశేషం. హౌస్ లోకి ఎంటర్ అయిన గంగవ్వ తన ఆట పాటలతో ఎంతో సరదాగా గడిపింది. చిన్నవారి నుంచి మొదలుకొని పెద్ద వారి వరకు గంగవ్వ అభిమానులుగా మారిపోయారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లతో ఎంత సరదాగా గడుపుతూ, బిగ్‌బాస్ హౌస్ లో నవ్వులు-పువ్వులు పూయించింది. విదేశాల్లో ఉన్న వారు సైతం గంగవ్వ కోసం బిగ్‌బాస్ చూసేవారు అంటే గంగవ్వకు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో తెలిసిపోతుంది.

బిగ్‌బాస్ హౌస్ లో ఉన్న గంగవ్వకు అనారోగ్యం కారణంగా ఎక్కువ కాలం పాటు హౌస్ లో ఉండలేక కేవలం 5 వారాలకే హౌస్ నుంచి బయటకు వచ్చింది. అయితే గంగవ్వ బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి గల కారణం ఎప్పటికైనా తన ఒక సొంత ఇంటిని నిర్మించుకోవాలని కల ఉండడంతో హౌస్ లోకి వెళ్లారు. అయితే ఆ కల అలాగే మిగిలిన పోకూడదని నాగార్జున గారు తన మంచి హృదయంతో గంగవ్వకు ఇల్లు కట్టి ఇస్తానని మాట ఇవ్వడంతో గంగవ్వతో పాటు తన అభిమానులు కూడా ఎంతో ఆనందపడ్డారు.

బిగ్‌బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఒక టాస్క్ లో భాగంగా గంగవ్వ లక్ష రూపాయల గెలిచారు. చందనా బ్రదర్స్ ఫ్యాషన్ షో నిర్వహించిన ర్యాంప్ వాక్ టాస్క్ లో భాగంగా గంగవ్వ విజేతగా నిలిచి లక్ష రూపాయలను సొంతం చేసుకున్నారు. అయితే ఆ లక్ష రూపాయలతో ఏం కొనాలా? అనే సందిగ్ధంలో ఉన్న గంగవ్వ ఎట్టకేలకు ఆ లక్ష రూపాయలతో బంగారం కొనడానికి హైదరాబాద్ వచ్చారు. లక్ష రూపాయల చెక్కును ఉపయోగించి రెండు తులాల బంగారం కొన్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను గంగవ్వ తన చానల్ ద్వారా పోస్ట్ చేశారు.


Next Story