హిట్స్ దక్కట్లేదని.. ఆ సినిమా సీక్వెల్ ను నమ్ముకున్నాడా.?

Fresh Buzz on Lingusamy’s Next. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘పైయ’. ఎన్. లింగుస్వామి దర్శకత్వం వహించారు.

By M.S.R  Published on  25 Feb 2023 6:45 PM IST
హిట్స్ దక్కట్లేదని.. ఆ సినిమా సీక్వెల్ ను నమ్ముకున్నాడా.?

బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘పైయ’. ఎన్. లింగుస్వామి దర్శకత్వం వహించారు. కార్తి, తమన్నా హీరో, హీరోయిన్ గా నటించారు. తెలుగులోకి ‘ఆవారా’ పేరుతో వచ్చింది. ఈ సినిమా ఇక్కడ భారీ విజయాన్ని అందుకుంది. కార్తీకి మంచి స్టార్డమ్ ను ఇచ్చిన సినిమా ఇది. మనసుకు నచ్చిన అమ్మాయితో రోడ్ జర్నీ, తన ప్రేమను ఎలా ఎక్స్ ప్రెస్ చేయాలో తెలియక పడే కష్టం.. సినిమాలో చూపించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. 2010లో వచ్చిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ హమ్ చేస్తూనే ఉంటారు. ఇక దర్శకుడు లింగు స్వామి ఆచితూచి సినిమాలు చేస్తున్నా కూడా పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. ఇక ఇటీవల రామ్ తో చేసిన 'వారియర్' సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఒకప్పుడు పందెంకోడి లాంటి మాస్ సినిమాలు చేసిన లింగుస్వామి.. ఇప్పుడు కాస్త డౌన్ అయ్యారని అభిమానులు అనుకుంటూ ఉన్నారు.

అయితే లింగు స్వామి ఆవారా చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్టు కోలీవుడ్ మీడియా అంటోంది. ‘పైయ 2’ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్టు వదంతులు షికార్లు కొడుతున్నాయి. హీరోయిన్ పాత్ర కోసం పూజా హెగ్డే ను సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అతి త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ మూవీలో బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా చేస్తున్నట్లు కథనాలు రాగా వాటిలో నిజం లేదని ఆ తర్వాత తేలింది. ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే తప్పితే కానీ క్లారిటీ వచ్చేట్టు కనిపించలేదు.


Next Story