బిగ్ బాస్ సెట్స్ లో భారీగా మంటలు

Fire breaks out at Bigg Boss 15 sets. రియాల్టీ షో 'బిగ్ బాస్' సెట్స్‌లో మంటలు చెలరేగాయి. ముంబైలోని గోరేగావ్

By Medi Samrat  Published on  13 Feb 2022 1:00 PM GMT
బిగ్ బాస్ సెట్స్ లో భారీగా మంటలు

రియాల్టీ షో 'బిగ్ బాస్' సెట్స్‌లో మంటలు చెలరేగాయి. ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలో ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బిగ్ బాస్ సెట్స్‌లో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు నాలుగు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) అధికారుల ప్రకారం ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు అవ్వలేదు. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ రియాలిటీ షో బిగ్ బాస్- 15 సెట్స్‌లో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం నాలుగు అగ్నిమాపక దళ వాహనాలు ఘటనా స్థలంలో ఉన్నాయి. ప్రమాదాన్ని లెవల్ 1 అగ్నిప్రమాదంగా పేర్కొన్నారు.

ముంబైలోని ఫిల్మ్ సిటీలో బీబీ సెట్ వేశారు. బిగ్ బాస్ 15 తేజస్వి ప్రకాష్ విజేతగా తేలడంతో ముగిసింది. సెట్‌లోని ఏ భాగంలో మంటలు చెలరేగాయో ఇంకా తెలియరాలేదు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నాలుగు నెలల పాటు ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ 15 జనవరి 30న విజేతను ప్రకటించడంతో ముగిసింది. BB 15 ట్రోఫీని గెలుచుకున్న అగ్ర పోటీదారులలో ఒకరిగా పరిగణించబడిన తేజస్వి ప్రకాష్, చివరకు సీజన్ 15 విజేతగా నిలిచింది. తేజస్వి ప్రకాష్ బిగ్ బాస్ 15 ట్రోఫీని, ప్రైజ్ మనీ రూ. 40 లక్షలను ఇంటికి తీసుకువెళ్లగా, ప్రతీక్ సెహజ్‌పాల్ రన్నరప్‌గా ప్రకటించింది.


Next Story
Share it