కమెడియన్ కపిల్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు
FIR against ‘The Kapil Sharma Show’. కమెడియన్ కపిల్ శర్మ చేస్తున్న పాపులర్ షో 'ది కపిల్ శర్మ షో' కార్యక్రమంపై ఒక
By Medi Samrat
కమెడియన్ కపిల్ శర్మ చేస్తున్న పాపులర్ షో 'ది కపిల్ శర్మ షో' కార్యక్రమంపై ఒక లాయర్ కేసు వేశాడు. మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన లాయర్ ఇటీవల ప్రదర్శించిన ఒక ఎపిసోడ్‌లో స్టేజిపై కోర్టురూమ్ సెట్ వేశారని, దానిలో నటులు బహిరంగంగానే మద్యం తాగుతూ కనిపించారని చెప్పారు. ఇది కోర్టును అగౌరవపరచడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఈ కార్యక్రమ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేసినట్లు సదరు లాయర్ చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా కోర్టులో షో నిర్మాతలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని న్యాయవాది సురేష్ ధకడ్ పిటీషన్ వేశారు.
'సోనీ టీవీలో వస్తున్న కపిల్ శర్మ షో చాలా అసంబద్ధంగా ఉంది. ఈ కార్యక్రమంలో మహిళలపై చాలా అసభ్య కామెంట్లు చేస్తారు. ఒక ఎపిసోడ్‌లో స్టేజిపై కోర్టురూమ్ సెట్ వేశారు. ఆ సెట్‌లో కొందరు నటులు బహిరంగంగానే మద్యం తాగుతూ కనిపించారు. ఇది కోర్టును అగౌరవపరచడమే. అందుకే సెక్షన్ 356/3 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశాను. ఇలాంటి వాటిని ఖచ్చితంగా ఆపాల్సిందే' నని పిటిషన్ వేసిన న్యాయవాది సురేష్ చెప్పారు. కోర్టు గది సన్నివేశంలో, సహనటుడు మద్యం బాటిల్‌తో వేదికపైకి వచ్చి దానిని రుచి చూడమని ఇతర వ్యక్తులను ప్రోత్సహిస్తాడు అని న్యాయవాది విలేకరులతో సంభాషిస్తూ చెప్పారు. ఈ దృశ్యం కోర్టు గౌరవాన్ని ఉల్లంఘిస్తుందని అన్నారు.