విషాదంలో సినీ ఇండ‌స్ట్రీ.. ప్రముఖ సినీ దర్శక నిర్మాత, నటి రవీనా టాండన్ తండ్రి క‌న్నుమూత‌

Filmmaker Ravi Tandon Dies At 86. ప్రముఖ సినీ దర్శక నిర్మాత, నటి రవీనా టాండన్ తండ్రి 'రవి టాండన్' శుక్రవారం నాడు

By Medi Samrat  Published on  11 Feb 2022 8:30 PM IST
విషాదంలో సినీ ఇండ‌స్ట్రీ.. ప్రముఖ సినీ దర్శక నిర్మాత, నటి రవీనా టాండన్ తండ్రి క‌న్నుమూత‌

ప్రముఖ సినీ దర్శక నిర్మాత, నటి రవీనా టాండన్ తండ్రి 'రవి టాండన్' శుక్రవారం నాడు కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ప్ర‌ముఖ వార్తా సంస్థ పీటీఐ కథనం ప్రకారం.. శ్వాసకోశ సమస్యల కారణంగా ఆయన మరణించారు. అమితాబ్ బచ్చన్ నటించిన 'ఖుద్దర్', రిషి కపూర్-నీతూ కపూర్ల 'ఖేల్ ఖేల్ మే', సంజీవ్ కుమార్ 'అన్హోనీ', రాజేష్ ఖన్నా 'నజరానా' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

తన తండ్రి మరణానికి సంబంధించి రవీనా సోషల్ మీడియాలో తండ్రితో ఉన్న ఫోటోను పంచుకున్నారు. భావోద్వేగ పోస్ట్‌ను పెట్టారు. "మీరు ఎల్లప్పుడూ నాతో నడుస్తూ ఉంటారు, నేను ఎల్లప్పుడూ మీలాగే ఉంటాను, మిమ్మల్ని ఎప్పటికీ వదలను. లవ్ యూ నాన్న." అంటూ పోస్టు పెట్టారు రవీనా. ఇతర ప్రముఖులు కూడా ఆయన మృతికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న తర్వాత, కొంతమంది సినిమా తారలు నివాళులర్పించడానికి ముంబైలోని రవీనా టాండన్ ఇంటికి వెళ్లారు. ఫరా ఖాన్, రిధిమా పండిట్ రవీనా ఇంటికి వెళ్లారు.


Next Story