వైరల్ ఫోటో: అప్పట్లో 'బిగ్ బి'తో సుశాంత్ సెల్ఫీ!
filmfare shares sushant singh rajput amitabh bachchan selfie. బాలీవుడ్ యువ నటుడు దివంగత హీరో అయిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 'బిగ్ బి'తో సెల్ఫీ.
By Medi Samrat Published on 22 Jan 2021 7:36 AM ISTబాలీవుడ్ యువ నటుడు దివంగత హీరో అయిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి దాదాపు ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటికీ తన అభిమానులు ఏదో విధంగా సోషల్ మీడియా ద్వారా తను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. బాలీవుడ్ ప్రముఖ టీవీ సీరియల్స్ లో నటిస్తూ,పలు చిత్రాలలో నటించి ఎంతో మంచి ప్రేక్షకులను సంపాదించుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 2020 జూన్ 14న ఆత్మహత్య చేసుకోవడంతో ఎంతో మంది ప్రేక్షకులు,అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అసలు సుశాంత్ ఎందుకు ఆ పని చేశాడో ఇప్పటికీ సరైన ఆధారాలు వెలువడలేదు.
సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక్కసారిగా డ్రగ్ మాఫియా చుట్టుముట్టింది.ఈ డ్రగ్స్ కారణం వల్లే సుశాంత్ మరణించి ఉంటారనే కోణంలో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే జనవరి 21 సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా మరొకసారి తన అభిమానులు ఆయనను గుర్తు చేసుకున్నారు. సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఫిలింఫేర్ సుశాంత్ కు సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
ఆ ఫోటోలు సుశాంత్ సింగ్ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి సెల్ఫీ తీసుకుంటున్నారు. 2016లో గ్లామర్ అండ్ స్టైల్ అవార్డుల సందర్భంగా కలిసిన వీరిద్దరు సెల్ఫీకి ఫోజు ఇచ్చారు. అంతేకాకుండా అవార్డు ఫంక్షన్లో వీరిద్దరు కలిసి ఐశ్వర్యరాయ్, ఆలియా భట్ తో కలసి ఫిలింఫేర్ కవర్ పేజీ కోసం ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈరోజు సుశాంత్ సింగ్ పుట్టిన రోజు కావడంతో ఫిలింఫేర్ ఈ ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం నెట్టింట్లో ఈ ఫోటో వైరల్ గా మారి ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఫోటోను చూసిన సదరు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ తమ అభిమాన నటుడు ప్రస్తుతం తమ మధ్య లేరని మరొకసారి సుశాంత్ ను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.