రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌పడిన క‌త్తి మ‌హేష్‌.. ఆస్ప‌త్రిలో చికిత్స‌

Film Critic Kathi Mahesh injured in road accident.న‌టుడు, ఫిల్మ్ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ పెను ప్ర‌మాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jun 2021 11:00 AM IST
రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌పడిన క‌త్తి మ‌హేష్‌.. ఆస్ప‌త్రిలో చికిత్స‌

న‌టుడు, ఫిల్మ్ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ పెను ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు. ఆయ‌న ప్రయాణిస్తున్న కారు ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదం నుంచి క‌త్తి మ‌హేష్ స్వ‌ల్ప‌గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కొడ‌వ‌లూరు మండ‌లం చంద్ర‌శేఖ‌ర్ పురం జాతీయ ర‌హ‌దారిపై ఇన్నోవాలో క‌త్తి మ‌హేశ్ ప్ర‌యాణిస్తున్నారు. అయితే.. ప్ర‌మాద వ‌శాత్తు ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారు ముందు వెలుతున్న లారీని వేగంగా ఢీ కొట్టింది.


ఈ ఘ‌ట‌న‌లో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. అయితే.. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవ‌డంతో వ‌ల్ల మ‌హేష్ స్వ‌ల్ప‌గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ప్రస్తుతం నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మ‌హేష్ స్వ‌ల్ప‌గాయాల‌తో ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డ‌డంతో ఆయ‌న కుటుంబ స‌భ్యులు, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

Next Story