ప్రముఖ సినీ నటుడు నాజర్‌కు గాయాలు, రక్తస్రావం.. ఆస్పత్రికి తరలింపు

Film actor Nazar was injured during the shooting of the film. ప్రముఖ సినీ నటుడు నాజర్‌కు గాయాలు, రక్తస్రావం.. ఆస్పత్రికి తరలింపు

By అంజి  Published on  17 Aug 2022 6:25 PM IST
ప్రముఖ సినీ నటుడు నాజర్‌కు గాయాలు, రక్తస్రావం.. ఆస్పత్రికి తరలింపు

ప్రముఖ సినీ నటుడు నాజర్‌కు షూటింగ్‌లో గాయాలయ్యాయి. హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీలో జరుగుతున్న షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. షూటింగ్‌ కోసం అక్కడకు వచ్చిన నాజర్‌.. మెట్లు దిగుతుండగా జారిపడ్డారు. దీంతో ఎడమ కన్ను కింద కణతి భాగంలో స్వల్ప గాయమైంది. నాజర్‌కు ప్రమాదం కావడంతో వెంటనే చిత్రయూనిట్‌ అప్రమత్తమైంది. రక్తస్రావం కావడంతో నాజర్‌ను ఆస్పత్రికి తరలించారు. నాజ‌ర్‌తోపాటు సుహాసిని, మెహ‌రీన్‌, షియాజీ షిండే షూటింగ్‌లో పాల్గొంటున్న‌ట్టు స‌మాచారం.

తెలుగు, త‌మిళంతోపాటు వివిధ భాష‌ల్లో ఎన్నో చిత్రాల్లో న‌టించారు నాజ‌ర్‌. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రేక్ష‌కులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కేవలం యాక్టింగ్‌లోనే కాకుండా.. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, ప్లేబ్యాక్‌ సింగర్‌గా కూడా వర్క్ చేశారు. అంతేకాకుండా డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గానూ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. బహుబలి సినిమాలో బిజ్జలదేవుడి క్యారెక్టర్‌లో అదరగొట్టారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. తాజాగా నాజర్‌ సినిమా షూటింగ్‌లో గాయపడటంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Next Story