వారి బాధ్య‌త నాదే.. సీఎం ఆదేశాల మేరకే ఇక్క‌డ‌కు వ‌చ్చాను

పుష్ప ప్రీమియర్ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమ‌ని.. ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చూస్తుంటామ‌ని ఎఫ్‌డీసీ చైర్మ‌న్‌ దిల్ రాజు అన్నారు

By Medi Samrat  Published on  24 Dec 2024 6:03 PM IST
వారి బాధ్య‌త నాదే.. సీఎం ఆదేశాల మేరకే ఇక్క‌డ‌కు వ‌చ్చాను

పుష్ప ప్రీమియర్ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమ‌ని.. ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చూస్తుంటామ‌ని ఎఫ్‌డీసీ చైర్మ‌న్‌ దిల్ రాజు అన్నారు. కిమ్స్ ఆసుప‌త్రిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, సినిమాకి వారధిలా ఉండాలని సీఎం నన్ను FDC చైర్మన్‌గా నియమించారన్నారు. వేరే ప్రోగ్రాం నిమిత్తం యూఎస్‌లో ఉన్నాను.. నిన్న వచ్చాను.. ఇవ్వాళ రాగానే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని తెలిపారు. రేవతి భర్త భాస్కర్‌ను ఇండస్ట్రీకి తీసుకుని వచ్చి ఏదోక జాబ్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. వాళ్ల బాధ్యత నేను తీసుకుంటానని తెలిపారు.

FDC ద్వారా వీరికి ఏ విధమైన సహకారం అందించగలిగితే అవి అందిస్తామ‌న్నారు. ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్యలో ఉండి... భాస్కర్ కుటుంబ బాధ్యత మేము తీసుకుంటామ‌న్నారు. శ్రీ తేజ ఆరోగ్యం కుదుట పడుతుంది.. సీఎం ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు. సీఎం రేవంత్‌తో కూడా వీరి బాధ్యత తీసుకోవడంపై చర్చించాను.. ఒకే అన్నారు అని పేర్కొన్నారు. ఇటువంటివి జరగటం దురదృష్టకరం.. ఎవ్వరూ కావాలని చెయ్యరు.. నేను అల్లు అర్జున్‌ను కలవబోతున్నాను.. టెక్నికల్‌గా భాస్కర్‌కు జరిగేవి అన్ని జరుగుతాయన్నారు. మేము అండగా నిలబడుతామ‌ని హామీ ఇచ్చారు.

Next Story