ఆ సినిమా కూడా భారత్‌లో విడుదలయ్యే అవకాశాలు లేనట్లే..!

ఇటీవలి పహల్గామ్ దాడి తర్వాత, పాకిస్తానీ నటులు నటించిన బాలీవుడ్ చిత్రాల మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

By Medi Samrat
Published on : 11 Aug 2025 9:03 PM IST

ఆ సినిమా కూడా భారత్‌లో విడుదలయ్యే అవకాశాలు లేనట్లే..!

ఇటీవలి పహల్గామ్ దాడి తర్వాత, పాకిస్తానీ నటులు నటించిన బాలీవుడ్ చిత్రాల మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పలు సినిమాల బహిష్కరణకు పిలుపులు ఇచ్చారు. పాకిస్తానీ నటులు నటించిన ఏ సినిమానైనా నిషేధించాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీని ఫలితంగా అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయి, విడుదల ఆలస్యం అయ్యాయి.

జూన్‌లో దిల్జిత్ దోసాంజ్ చిత్రం సర్దార్ జీ 3 భారతదేశంలో కాకుండా ఇతర దేశాలలో మాత్రమే విడుదలైంది. ఈ చిత్రం విదేశాలలో భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు, ఫవాద్ ఖాన్ బాలీవుడ్ చిత్రం 'అబీర్ గులాల్' కూడా అదే స్ట్రాటజీని ప్లాన్ చేస్తోంది.

ఈ చిత్రం ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది కానీ భారతదేశ థియేటర్లలోకి రాదు. ఆర్తి ఎస్ బాగ్డి దర్శకత్వం వహించి వివేక్ అగర్వాల్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీలో ఫవాద్ ఖాన్, వాణి కపూర్, సోని రజ్దాన్, లిసా హేడాన్, రిధి డోగ్రా, ఫరీదా జలాల్ నటించారు. దీనిని పూర్తిగా భారతదేశం వెలుపల 5-10 కోట్ల బడ్జెట్‌తో చిత్రీకరించారు.

Next Story