ఏ ఉద్దేశ్యంతో అడుగుతున్నాడో నాకు అర్థమైంది.. హైదరాబాద్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి న‌టి సంచ‌ల‌న కామెంట్స్‌

అమీర్ ఖాన్ సినిమా 'దంగల్' తో తెరంగేట్రం చేసిన ఫాతిమా సనా షేక్ ఓ దక్షిణాది సినిమా ఆడిషన్స్ సమయంలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది.

By Medi Samrat  Published on  28 Jan 2025 6:58 PM IST
ఏ ఉద్దేశ్యంతో అడుగుతున్నాడో నాకు అర్థమైంది.. హైదరాబాద్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి న‌టి సంచ‌ల‌న కామెంట్స్‌

అమీర్ ఖాన్ సినిమా 'దంగల్' తో తెరంగేట్రం చేసిన ఫాతిమా సనా షేక్ ఓ దక్షిణాది సినిమా ఆడిషన్స్ సమయంలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది. ఫాతిమా ఒక కాస్టింగ్ ఏజెంట్ కాల్‌ను గుర్తుచేసుకుంది. అతడి మాటలు తనకు అసౌకర్యంగా అనిపించాయని బయటపెట్టింది.

'మీరు ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారా' అని ఓ వ్యక్తి తనను అడిగాడని, నేను కష్టపడి పని చేస్తానని, పాత్రకు ఏది అవసరమో అది చేస్తానని చెప్పానని ఫాతిమా తెలిపింది. అయినా కూడా ఆ వ్యక్తి తనతో 'మీకు అవకాశం కావాలంటే ప్రతి పనిని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏది చేయడానికైనా అంగీకరించాలి’ అని చెప్పడంతో అతడు ఏ ఉద్దేశ్యంతో అడుగుతున్నాడో తనకు అర్థమైందని తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన కొందరు నిర్మాతలు దాని గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడతారని ఫాతిమా తెలిపింది. ఇలాంటి ఘటనల వలన తాను కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని ఫాతిమా వివరించింది.

ముంబైలో కొత్తవారిని "రిఫరెన్స్" సాకుతో వారి సంపాదన నుండి డబ్బులు డిమాండ్ చేయడం ద్వారా కాస్టింగ్ డైరెక్టర్లు దోపిడీకి దిగుతుంటారని ఫాతిమా సనా షేక్ బయటపెట్టింది. ఫాతిమా సనా షేక్ కమల్ హాసన్ లీడ్ రోల్ లో చేసిన 'చాచీ 420'లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. తరువాత, ఆమె థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లూడో, అజీబ్ దాస్తాన్స్, థార్, సామ్ బహదూర్ వంటి చిత్రాలలో పనిచేసింది.

Next Story