మహేష్ సినిమాలో ఆ హీరోయిన్ ఫిక్స్.. అదిరిపోయే ఛాన్స్ వచ్చింది.!

Faria Abdullah in SSMB28. మెరుపు దీపమైనట్టు చిన్న హీరోయిన్ కి ఓ సూపర్ ఛాన్స్ వచ్చింది.

By Sumanth Varma k  Published on  27 Sept 2022 9:08 PM IST
మహేష్ సినిమాలో ఆ హీరోయిన్ ఫిక్స్.. అదిరిపోయే ఛాన్స్ వచ్చింది.!

మెరుపు దీపమైనట్టు చిన్న హీరోయిన్ కి ఓ సూపర్ ఛాన్స్ వచ్చింది. ఆ చిట్టి ఇప్పుడు ఏకంగా మహేష్ తో జోడీ కట్టడానికి రెడీ అయింది. ఇంతకీ, ఎవరు ఈ చిట్టి అనేగా ?.. పేరు ఫ‌రియా అబ్దుల్లా. 'జాతి ర‌త్నాలు' చిత్రంలో ఈ చిన్నది చిట్టిగా నటించి మెప్పించింది. 'జాతి ర‌త్నాలు' ప్రేక్షకుల మొహాల్లో నవ్వులు చిందించగా.. చిట్టి 'ఫ‌రియా అబ్దుల్లా' కి త్రివిక్రమ్ బంఫర్ ఆఫర్ ఇచ్చాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఒక చిన్న హీరోయిన్ కి పాన్ ఇండియా రేంజ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ రావడం అంటే, ఆశ్చర్యమే.

చిట్టి కి మహేష్ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టే.. మిగిలిన స్టార్ల చిత్రాల్లో కూడా అవ‌కాశాలు క్యూ కడితే.. అతి త్వరలోనే మోస్ట్ వాంటేడ్ హీరోయిన్ గా ఫ‌రియా అబ్దుల్లా టాలీవుడ్ లో ఒక రేంజ్ కి వెళ్తుంది. కాకపోతే, ఫ‌రియా అబ్దుల్లాకు త్రివిక్రమ్ ఏ రేంజ్ క్యారెక్టర్ ఇస్తాడు అన్నదే ? ఇక్కడ క్వశ్చన్ మార్క్. సహజంగా త్రివిక్రమ్ సినిమాల‌లో ఇద్దరు హీరోయిన్లు క‌నిపిస్తుంటారు. తాజా చిత్రంలోనూ ఫ‌రియా అబ్దుల్లాకు ద‌క్కింది రెండో హీరోయిన్ ఛాన్సా..? లేక.. ఆమె పాత్ర కథలో కీలకమా ? అనేది చూడాలి.

ఒకసారి త్రివిక్రమ్ సినిమాలను పరిశీలిస్తే.. హీరోయిన్ల పాత్రలు కథలో భాగమైతేనో.. రెండో హీరోయిన్ పాత్రకు స్కోప్ ఉంటేనో.. ఏ చిన్న పాత్రకో, కనీసం ఒక పాట కోసమో మరో హీరోయిన్ ను సంప్ర‌దిస్తారు. అదే త్రివిక్రమ్ ట్రేడ్ మార్క్. ఈ క్రమంలోనే ఫ‌రియా అబ్దుల్లా ఛాన్స్ దక్కిందని టాక్ ఉంది.

ఇక చాలా కాలం తర్వాత త్రివిక్రమ్ తో మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు. అయితే, గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు, ఖలేజా చిత్రాల ఫలితాలు ఆ సమయంలో నిరాశ పరిచాయి. బుల్లితెర‌పై అతడు, ఖలేజా అద్భుతమైన టీఆర్పీ రేటింగ్ తో సరికొత్త రికార్డులు సృష్టించినా.. ఆశించిన స్థాయిలో థియేటర్ రెవిన్యూను సాధించలేకపోయాయి. ఇప్పుడు వీరి కలయికలో మూడో సినిమా రాబోతుంది. దీనికితోడు ఈ సినిమాలో త్రివిక్రమ్ రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రస్తావించబోతున్నాడు. పైగా ఈ సినిమాలో రెండు బలమైన నేపథ్యాలు.. ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం, పలనాటి ప్రాంతానికి సంబంధించిన యాక్షన్ నేపథ్యం ఉండనున్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.


Next Story