బాలీవుడ్‌లో మరో పెళ్లి సందడి

Farhan Akhtar And Shibani Dandekar Are Getting Married In February. బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్, షిబానీ దండేకర్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు. వీరి పెళ్లికి సంబంధించిన పుకార్లు ఎట్టకేలకు

By అంజి  Published on  4 Feb 2022 6:00 PM IST
బాలీవుడ్‌లో మరో పెళ్లి సందడి

బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్, షిబానీ దండేకర్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు. వీరి పెళ్లికి సంబంధించిన పుకార్లు ఎట్టకేలకు నిజమయ్యాయి. బాంబే టైమ్స్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఫర్హాన్ తండ్రి, ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్ వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 21న జరుగుతుందని ధృవీకరించారు. పెళ్లికి సంబంధించిన పనులను వెడ్డింగ్ ప్లానర్స్ చూసుకుంటారని, భద్రతా నిబంధనలను దృష్టిలో ఉంచుకుని, వివాహం తక్కువ మంది మధ్యన ఉంటుందని జావేద్ అక్తర్ అన్నారు. అ"పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే, మేము పెద్ద ఎత్తున ఫంక్షన్ ను హోస్ట్ చేయలేమని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, మేము కొంతమందిని మాత్రమే పిలుస్తున్నాము. ఇది చాలా సులభమైన వ్యవహారం అవుతుంది." అని అన్నారు.

తన కాబోయే కోడలు శిబానీ దండేకర్ గురించి జావేద్ అక్తర్ మాట్లాడుతూ, "ఆమె చాలా మంచి అమ్మాయి. మా అందరికీ ఆమె చాలా ఇష్టం. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫర్హాన్, ఆమె చాలా బాగా కలిసి ఉండటమే" అని చెప్పుకొచ్చారు. షిబానీ దండేకర్, ఫర్హాన్ అక్తర్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. ఫర్హాన్ గతంలో ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్ అధునా భబానీని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు - షాక్యా, అకీరా ఉన్నారు. ఫర్హాన్ అక్తర్ గత ప్రాజెక్ట్ తూఫాన్, దీనికి రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా, అలియా భట్, కత్రినా కైఫ్ నటిస్తున్న 'జీ లే జరా' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Next Story