ఇంకొన్ని గంటల్లో ఫ్యామిలీ మాన్ సీజన్-2.. సమంత ఉండడమే స్పెషల్
Family Men2 Web Series. ఫ్యామిలీ మాన్.. మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి నటించిన ఈ వెబ్ సిరీస్ మంచి పేరును
By Medi Samrat Published on 3 Jun 2021 4:25 PM ISTఫ్యామిలీ మాన్.. మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి నటించిన ఈ వెబ్ సిరీస్ మంచి పేరును తెచ్చుకుంది. మొదటి సీజన్ మంచి హిట్ గా మారింది. ఇప్పుడు సెకండ్ సీజన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంకొన్ని గంటల్లో సెకండ్ సీజన్ మీ ముందుకు రాబోతోంది. ప్రైమ్ వీడియోలో సీజన్-2 విడుదల కాబోతోంది.
సీజన్-2లో అక్కినేని సమంత ఉండడంతో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవలే సీజన్-2 కు సంబంధించిన ట్రైలర్ విడుదలవ్వగా ఓ వైపు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో వైపు విమర్శలు కూడా వచ్చాయి. సమంత క్యారెక్టర్ తమిళుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని విమర్శలు వచ్చాయి. కొందరు రాజకీయ నాయకులు కూడా ట్రైలర్ ను చూసి విమర్శలు గుప్పించారు. ఇంకొద్ది గంటల్లో సెకండ్ సీజన్ విడుదలవుతున్న నేపథ్యంలో సమంతకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు వెలిశాయి. #WeSupportSamantha, #WeLoveSamantha అనే హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతూ ఉన్నాయి.
శ్రీకాంత్ తివారీ క్యారెక్టర్ లో మనోజ్ బాజ్ పాయ్ నటిస్తూ ఉన్నారు. ఓ వైపు దేశాన్ని రక్షిస్తూ.. మరో వైపు కుటుంబ పెద్దగా బాధ్యతలు నిర్వర్తిస్తూ నవ్వులు పూయిస్తూ ఉంటాడు. ఓ వైపు స్పై లాగా.. మరో వైపు మిడిల్ క్లాస్ మనిషిలా మనోజ్ బాజ్ పాయ్ నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అందుకే సీజన్-2 కోసం ఎంతగానో అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. జూన్ 4న ప్రైమ్ వీడియోలో సీజన్-2 రిలీజ్ అవ్వబోతోంది.