నాగిణీ ఆరో సీజన్ రాబోతోంది

Ekta Kapoor announces Naagin 6 premiere date. నాగిణీ సీరియల్ అటు హిందీలోనూ, ఇటు దక్షిణాది లోనూ ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకుంది

By Medi Samrat  Published on  8 Nov 2021 1:22 PM GMT
నాగిణీ ఆరో సీజన్ రాబోతోంది

నాగిణీ సీరియల్ అటు హిందీలోనూ, ఇటు దక్షిణాది లోనూ ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ సీరియల్ లో లీడ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్లు ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ కూడా అయ్యి.. ఫుల్ బిజీగా ఉంటున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ ఇప్పటి వరకూ 5 సీజన్లను ప్రేక్షకులకు అందించింది. ఇప్పుడు ఆరో సీజన్ అతి త్వరలోనే రాబోతోందట.. తాజాగా ఏక్తా కపూర్ అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ ను చేశారు. బిగ్ బాస్ సీజన్ 15 వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో ఏక్తా కపూర్ ప్రత్యేక అతిథిగా ఇంట్లోకి ప్రవేశించింది. సల్మాన్ ఖాన్‌తో వేదికను పంచుకున్నప్పుడు సూపర్‌నేచురల్ టీవీ డ్రామా నాగిణీ ఇప్పుడు ఆరవ సీజన్ తో తిరిగి రావడానికి సిద్ధంగా ఉందని ఏక్తా వెల్లడించింది.

ఆమె ప్రధాన నటి గురించి హింట్ ను ఇవ్వడమే కాకుండా ప్రీమియర్ తేదీని వెల్లడించింది. ఏక్తా కపూర్ తాను 'ఏక్: బ్రింగ్ ఇండియా బ్యాక్ హోమ్' పేరుతో తన హోమ్ డెకర్ బ్రాండ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. నాగిణీ ఆరవ సీజన్‌తో తిరిగి వస్తున్నట్లు ఆమె వెల్లడించింది. నాగిణీ సీజన్ 6 మొదటి ఎపిసోడ్ జనవరి 30, 2022న ప్రసారం కానుందని ఆమె ప్రకటించారు. రాబోయే షోలో ఇద్దరు ప్రధాన నటీమణుల్లో ఒకరి గురించి సల్మాన్ ఖాన్‌కు తెలుసని ఏక్తా వెల్లడించారు. ఆ నటి పేరును వెల్లడించనప్పటికీ.. ఆమె పేరు 'M' లెటర్ తో ప్రారంభమవుతుందని చెప్పారు.


Next Story
Share it