సినీ నటి, బీజేపీ నేత జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. థియేటర్ నిర్వహణకు సంబంధించిన కేసులో చెన్నై ఎగ్మోర్ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల ESI డబ్బులు చెల్లించనందుకు శక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో కోర్టు జయప్రదతో పాటు మరో ఇద్దరిని కూడా దోషులుగా నిర్ధారించింది.
అన్నశాలలోని జయప్రదకు చెందిన థియేటర్ యాజమాన్యం ఈఎస్‌ఐ చెల్లించడం లేదని ఆ థియేటర్ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. దీనిపై బీమా కంపెనీ ఫిర్యాదు చేసింది. ఉద్యోగుల సొమ్మును సీజ్ చేసినా.. ఈఎస్‌ఐ ఖాతాలో జమ చేయలేదనేది ఫిర్యాదు. దీన్ని వ్యతిరేకిస్తూ జయప్రద హైకోర్టును ఆశ్రయించగా.. కిందికోర్టే ఈ కేసును తేల్చాలని హైకోర్టు పేర్కొంది.