నటి ఈషా రెబ్బ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తున్న తన ఫోటోలు, వీడియోలకు ఒక వ్యక్తి అసభ్యకరమైన, అభ్యంతరకరమైన కామెంట్లు పెడుతున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి సంబందించిన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వివరాలు, అతడు చేసిన కామెంట్ల స్క్రీన్ షాట్లను కూడా ఈషా రెబ్బ పోలీసులకు అందజేశారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికలలో మహిళలను వేధించడం నేరమని, ఇలాంటి ఘటనల్లో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.