షారుఖ్ ఖాన్ డంకీ సినిమా OTT స్ట్రీమింగ్ కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. షారుక్ ఖాన్ నటించిన కామెడీ-డ్రామా డంకీ గత డిసెంబర్‌లో సాలార్‌తో పాటు విడుదలైంది. రాజ్ కుమార్ హిరానీ- షారుఖ్ ఖాన్‌తో సినిమా అనగానే బాలీవుడ్‌లో భారీ కాంబినేషన్ గా భావించారు. ప్రకటన వెలువడిన రోజు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ కాంబో థియేటర్లలో మ్యాజిక్ క్రియేట్ చేయడంలో విఫలమైంది. ప్రమోషన్లు కూడా పెద్దగా చేయకపోవడంతో సినిమా పెద్దగా ప్రేక్షకులకు రీచ్ అవ్వలేదు. ఇక సాలార్ వంటి మాస్ ఎంటర్‌టైనర్‌తో పోటీ పడటం చిత్రం పరాజయానికి దారితీసింది. అంతకు ముందు అదే ఏడాది షారుక్ నటించిన పఠాన్, జవాన్ వంటి బ్లాక్‌బస్టర్‌లలో సగం కూడా కలెక్షన్స్ వసూలు చేయడంలో డంకీ విఫలమైంది.
డంకీ థియేట్రికల్ విడుదల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైనప్పటికీ.. మూవీ లవర్స్ ఈ సినిమా OTT విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. OTT స్ట్రీమింగ్ హక్కులను Jio సినిమా కొనుగోలు చేసింది. స్ట్రీమింగ్ తేదీ ఫిబ్రవరి 16 అని భావిస్తూ ఉన్నారు. బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఈ చిత్రం మేకింగ్ ఖర్చు 85 కోట్ల రేంజ్‌లో ఉంది. ఈ చిత్రం భారీగా నాన్-థియేట్రికల్ బిజినెస్ చేసింది. నిర్మాతలకు బాగానే డబ్బులు వచ్చాయి.