దృశ్యం 3 నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ అక్షయ్ ఖన్నా పాత్రను జైదీప్ అహ్లావత్ చేయిస్తున్నట్లు ధృవీకరించారు. అక్షయ్ ఖన్నాకు వృత్తిపరమైన క్రమశిక్షణ లేదని ఆయన ఆరోపించారు. చిత్రీకరణకు కొన్ని రోజుల ముందు నటుడు ప్రాజెక్ట్ నుండి అకస్మాత్తుగా నిష్క్రమించడంపై తాను చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నానని చెప్పారు. విస్తృత చర్చలు, అధికారిక ఒప్పందం తర్వాత అక్షయ్ ఈ చిత్రానికి సంతకం చేశారని, కానీ అతని షెడ్యూల్ షూటింగ్‌కు పది రోజుల ముందు వైదొలిగాడని కుమార్ వివరించారు.
బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత మాట్లాడుతూ, "మేము అక్షయ్ ఖన్నాతో ఒప్పందం కుదుర్చుకున్నాము. చాలా చర్చలు జరిగిన తర్వాత అతని రెమ్యునరేషన్ కూడా లాక్ అయ్యాయి. అతను విగ్ ధరించాలనుకుంటున్నానని పట్టుబట్టాడు. కానీ (దర్శకుడు) అభిషేక్ పాఠక్ అది ఆచరణాత్మకం కాదని ఒప్పించాడు, ఎందుకంటే దృశ్యం 3 సీక్వెల్ కాబట్టి పలు సమస్యలు వస్తాయి." అని తెలిపారు. ఒకానొక దశలో అక్షయ్ ఖన్నా చేతిలో పని కూడా లేదని, కానీ ఇప్పుడు సక్సెస్ అతడి తలకెక్కిందని విమర్శించారు.