సాయి పల్లవికి అందుకే రాలేదు..!
నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తెలుగు సినిమా 'తండేల్' ఫిబ్రవరి 7, 2025 న విడుదల చేయనున్నారు.
By Medi Samrat Published on 2 Feb 2025 12:02 PM IST
నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తెలుగు సినిమా 'తండేల్' ఫిబ్రవరి 7, 2025 న విడుదల చేయనున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆంధ్రాలోని శ్రీకాకుళం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం మంచి బజ్ ను సృష్టించింది. నాగచైతన్య కెరీర్ లో మంచి హిట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
చిత్ర బృందం ముంబైలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా భాగమయ్యారు. ఈ ఈవెంట్ కు ప్రముఖ నటి సాయి పల్లవి ఆరోగ్య సమస్యల కారణంగా దూరమైంది. అనేక నగరాల్లో ప్రచార కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న నటి, అనారోగ్యానికి గురైంది. రెండు రోజులు పడక విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. మొదట ఈ కార్యక్రమానికి సాయి పల్లవి హాజరు అవుతుందని భావించామని, అయితే జ్వరం కారణంగా రాలేకపోయిందని దర్శకుడు చందూ మొండేటి ధృవీకరించారు. సాయి పల్లవి ‘తండేల్’ సినిమాతో పాటు ‘రామాయణం: పార్ట్ 1’ సినిమా కోసం కూడా సిద్ధమవుతోంది. 2026 దీపావళికి విడుదల కానున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా కనిపించనుండగా, సాయి పల్లవి సీత పాత్రను పోషిస్తోంది.