సిద్ధార్థ్ భార్య‌ అదితి గురించి ఈ విష‌యాలు తెలుసా.?

ఢిల్లీ 6, రాక్‌స్టార్ చిత్రాలతో తనదైన ముద్ర వేసిన నటి అదితి రావ్ హైదరీ ప్రస్తుతం తన రెండవ వివాహం కార‌ణంగా వార్తల్లో ఉంది

By Medi Samrat  Published on  17 Sept 2024 12:37 PM IST
సిద్ధార్థ్ భార్య‌ అదితి గురించి ఈ విష‌యాలు తెలుసా.?

ఢిల్లీ 6, రాక్‌స్టార్ చిత్రాలతో తనదైన ముద్ర వేసిన నటి అదితి రావ్ హైదరీ ప్రస్తుతం తన రెండవ వివాహం కార‌ణంగా వార్తల్లో ఉంది. అదితి తన జీవిత భాగస్వామిగా నటుడు సిద్ధార్థ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. ఈ జంట చాలా కాలంగా ఒకరితో ఒకరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. నిన్న‌ వారు వివాహం ద్వారా మ‌రింత చేరువ‌య్యారు. అదితి రావ్ హైదరీ మొదటి పెళ్లికి సంబంధించి చర్చ తీవ్రంగా న‌డుస్తుంది. సినీ ప్రేమికులు ఆమె మొదటి భర్త ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారు.

అదితి రావ్ హైదరీ 2009లో నటుడు సత్యదీప్ మిశ్రాను పెళ్లాడింది. ఒక మీడియా ఇంటర్వ్యూలో సత్యదీప్ కూడా అదితితో తన వివాహం గురించి బహిరంగంగా మాట్లాడాడు. మొదట్లో వారిద్దరి మధ్య అంతా సవ్యంగానే సాగింది. అయితే కాలం గడిచేకొద్దీ వారి బంధం చెడింది. దీంతో 2013లో అదితి-సత్యదీప్‌లు విడాకుల ద్వారా శాశ్వతంగా విడిపోయారు. సత్యదీప్ మిశ్రా సినీ పరిశ్రమకు సుపరిచితుడు. నటుడు కాకముందు ఆయ‌న‌ వృత్తిరీత్యా న్యాయవాది.

నటుడిగా సత్యదీప్ మిశ్రా ఫోబియా, తనవ్, నో వన్ కిల్డ్ జెస్సికా, విక్రమ్-వేద, ముఖ్బీర్ వంటి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేశారు. కొంతకాలం క్రితం అతడు నటి నీనా గుప్తా కుమార్తె మసాబా గుప్తాను రెండవ వివాహం చేసుకున్నాడు.

రంగ్ దే బసంతి సినిమాతో బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన నటుడు సిద్ధార్థ్.. ఎక్కువ‌గా తమిళ‌, తెలుగు సినిమాల్లో న‌టించాడు. అతడు దక్షిణ భారత సంస్కృతిలోనే అదితి రావు హైదరీని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ జంట పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో వీరిద్ద‌రి వివాహం ఘ‌నంగా జ‌రిగింది. ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితులు ఈ వివాహంకు హాజరయినట్లు తెలుస్తుంది. వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో నటి అదితి రావు హైదరి కూడా ఒకరు. దీంతో పురోహితులు దగ్గరుండి ఈ పెళ్లి జ‌రిపించారు.

Next Story