సమంత తండ్రి గురించి ఈ విషయాలు తెలుసా.?

సినీ నటి సమంత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు.

By Medi Samrat  Published on  29 Nov 2024 8:45 PM IST
సమంత తండ్రి గురించి ఈ విషయాలు తెలుసా.?

సినీ నటి సమంత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. "నాన్నా... మనం మళ్లీ కలిసేంత వరకూ.." అని ఆమె పోస్ట్ పెట్టారు. హృదయం ముక్కలైన ఎమోజీని షేర్ చేశారు. సమంత తండ్రి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సమంత తండ్రి తెలుగు వారే, తల్లి ఒక సిరియన్ మలయాళీ. సమంత కి ఇద్దరు అన్నలు కూడా ఉన్నారు. సమంత ఒక ఇంటర్వ్యూలో, తండ్రి జోసెఫ్, ఆమె తల్లి నినెట్ ప్రభుతో తన చిన్నతనం గురించి మాట్లాడింది. తన తండ్రి గురించి మాట్లాడుతూ ఆయన కూడా చాలా మంది భారతీయ తల్లిదండ్రుల లాంటివాడని తెలిపింది. తాను ఎదగడానికి ఎంతగానో కృషి చేశాడని.. తన తండ్రిని చూసి ఎన్నో నేర్చుకున్నానని పలు సందర్భాల్లో తెలిపింది. ఇక సమంత డైవర్స్ సమయంలో కూడా జోసెఫ్ ప్రభు తన బాధను వ్యక్తం చేశారు. ఇలా జరుగుతుందని అనుకోలేదని చెప్పారు.

Next Story