డీజే టిల్లు మళ్లీ వచ్చేశాడు.. ఇంకా బుద్ధి మారలేదు..!

DJ Tillu is back with the same swag and attitude. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా

By Medi Samrat  Published on  24 July 2023 8:19 PM IST
డీజే టిల్లు మళ్లీ వచ్చేశాడు.. ఇంకా బుద్ధి మారలేదు..!

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఫంక్షన్‌ జరిగినా అందరూ కలిసి స్టెప్స్ వేయడానికి సినిమా టైటిల్ సాంగ్ ప్లే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు డీజే టిల్లుకి సీక్వెల్ గా వస్తున్న టిల్లూ స్క్వేర్ మేకర్స్ ఈ సినిమాలోని కొత్త సాంగ్ రాబోతోందని చెబుతున్నారు. “టికెట్ ఏ కొనకుండా” అనే పాటను జూలై 26న విడుదల చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రోమో చూస్తుంటే, DJ టిల్లూలో స్వాగ్, యాటిట్యూడ్‌ ఏ మాత్రం తగ్గలేదు.

డీజే టిల్లులో నేహా శెట్టితో రొమాన్స్ చేసిన సిద్ధూ.. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ తో కలిసి రచ్చ చేయనున్నారు. ప్రోమోలోనే అనుపమతో ఫుల్ సరసాలు చేస్తూ సిద్ధూ కనిపించాడు. డైలాగ్స్, యాటిట్యూడ్, స్వాగ్ అన్నీ మొదటి పార్ట్ లాగా ఉన్నాయి. అనుపమ కూడా హాట్ హాట్ గా కనిపిస్తోంది. పూర్తి లిరికల్ వీడియో సాంగ్ జూలై 26న విడుదల కానుంది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ ప్రోమో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 15న థియేటర్లలోకి రానుంది. రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద కూడా అదే రోజే విడుదల కాబోతోంది.


Next Story