హీరోయిన్ మచ్చల గురించి ప్రముఖ జర్నలిస్ట్ ప్రశ్న.. స్పందించిన 'డీజే టిల్లు' హీరోయిన్ నేహా శెట్టి

DJ Tillu Heroine neha shetty calls out journo for asking sexist question. సిద్దు జొన్నలగడ్డ.. నేహా శెట్టి జంటగా నటించిన సినిమా డీజే టిల్లు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను.. సితార

By M.S.R  Published on  3 Feb 2022 4:21 PM IST
హీరోయిన్ మచ్చల గురించి ప్రముఖ జర్నలిస్ట్ ప్రశ్న.. స్పందించిన డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి

సిద్దు జొన్నలగడ్డ.. నేహా శెట్టి జంటగా నటించిన సినిమా డీజే టిల్లు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. బుధవారం హైదరాబాద్‏లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్రయూనిట్ హాజరయ్యి విలేకరులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నలు అడగడం హద్దులు దాటింది అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇదెక్కడి జర్నలిజం అంటూ విమర్శలు చేశారు. ఈ వీడియోను హీరోయిన్ నేహా శెట్టి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేసింది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఇలాంటి ప్రశ్నలు అడగడం చాలా దురదృష్టకరం.

దీన్ని బట్టి అతను తన చుట్టు ఉండే మహిళలు.. ఇంట్లో వారిని ఎలా గౌరవిస్తున్నాడో అర్థమవుతోందంటూ విమర్శించారు. ఇక హీరోయిన్ కు కలిగిన అసౌకర్యానికి నిర్మాత నాగవంశీ క్షమాపణలు చెప్పాడు. డీజే టిల్లు ట్రైలర్ లో హీరోయిన్ కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయని హీరోగా అడగ్గా.. పదహారు అంటూ ఆన్సర్ ఇస్తుంది హీరోయిన్. ఇక ఇదే డైలాగ్ ను ఓ ప్రముఖ జర్నలిస్ట్ సినిమాలో డైలాగ్ చెప్పారు కదా.. నిజంగానే ఎన్ని పుట్ట మచ్చలు ఉన్నాయో తెలుసుకున్నారా ? అంటూ అడిగేశాడు. ఈ ప్రశ్నకు హీరో ఇబ్బంది పడుతూ.. ఈ ప్రశ్నను అవాయిడ్ చేద్దాం అంటూ సమాధానం ఇచ్చారు. ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదల అవుతోంది. ట్రైలర్ మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా నవ్వులు పూయిస్తూ ఉంది.

Next Story