దివ్య భారతి తండ్రి ఇక లేరు.. చనిపోయే ముందు వరకూ ఎవరి దగ్గర ఉన్నారంటే..
Divya Bharti’s Father Passes Away. దివ్య భారతి.. ఈ పేరు మరచిపోని తెలుగు అభిమాని అంటూ ఉండరు. ఆమె ఎంత తక్కువ
By Medi Samrat Published on 1 Nov 2021 11:51 AM GMTదివ్య భారతి.. ఈ పేరు మరచిపోని తెలుగు అభిమాని అంటూ ఉండరు. ఆమె ఎంత తక్కువ సమయంలో స్టార్డమ్ ను సంపాదించిందో.. అంతే తక్కువ సమయంలో అందరినీ విడిచి వెళ్ళిపోయింది. దివంగత నటి దివ్య భారతి కుటుంబంలో ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి ఓం ప్రకాష్ భారతి కన్నుమూశారు. ఆయన అక్టోబర్ 30న ఆయన తుదిశ్వాస విడిచారని తెలుస్తోంది. దివ్య భారతి మాజీ భర్త, చిత్రనిర్మాత సాజిద్ నదియాడ్వాలా తన తల్లిదండ్రులను ఎలా చూసుకున్నారో అదే విధంగా దివ్య భారతి తల్లిదండ్రులను కూడా చూసుకున్నారని బాలీవుడ్ కు చెందిన ప్రముఖ వెబ్సైట్ తెలిసింది. ఓం ప్రకాష్ భారతి చివరి శ్వాస వరకు సాజిద్ దగ్గరే ఉన్నారు. దివ్య భారతి తండ్రి మరణం తరువాత ఆమె తల్లి బాధ్యత కూడా సాజిదే చూసుకుంటున్నాడు. నివేదిక ప్రకారం.. దివ్య భారతి మరణించినప్పుడు సాజిద్ ఆమె తండ్రితోనే ఉన్నాడు. మరుసటి రోజు అంత్యక్రియలు జరిగినప్పుడు కూడా సాజిద్ అక్కడే ఉన్నాడు. సాజిద్ దివ్యభారతి తల్లి దండ్రులను అమ్మా నాన్న అని పిలిచేవాడు. ఇప్పుడు దివ్య భారతి, ఆమె తండ్రి ఓం ప్రకాష్ భారతి ఇద్దరూ ఈ ప్రపంచంలో లేరు.
బాలీవుడ్ హంగామా యొక్క నివేదికలో సాజిద్‌కు ఓం ప్రకాష్ భారతి తన సొంత తండ్రిలాంటివాడు. అతను దివ్య తల్లిదండ్రులను అమ్మా నాన్న అని పిలుస్తాడు. సాజిద్ దివ్య తల్లిని కొడుకులా చూసుకుంటాడు. గోవింద ప్రధాన పాత్రలో నటించిన షోలా ఔర్ షబ్నం సెట్స్‌లో దివ్య భారతి మరియు సాజిద్ కలుసుకున్నారు. దీని తరువాత, ఇద్దరూ 1992లో పెళ్లి చేసుకున్నారు. దివ్య సాజిద్‌ను వివాహం చేసుకున్నప్పుడు ఆమె కెరీర్‌లో పీక్‌లో ఉంది.. అప్పటికి ఆమెకు కేవలం 18 సంవత్సరాలు. 1993లో అంధేరిలో ఉన్న ఒక భవనంలోని ఐదవ అంతస్తులో ఉన్న బాల్కనీ నుండి కింద పడి ఆమె మరణించింది. 19 సంవత్సరాల వయస్సులోనే దివ్య భారతి అందరినీ వదిలేసి వెళ్ళిపోయింది.