టాలీవుడ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చిక్కుల్లో పడ్డాడు. నిన్న జరిగిన మజాకా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ త్రినాథ్ నక్కిన మాట్లాడుతూ హీరోయిన్ అన్షు గురించి సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. త్రినాథ రావు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్నట్లు మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద తాజాగా వెల్లడించారు. ఈ మేరకు త్రినాథ రావుకు త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద తెలిపారు.
నిన్న త్రినాథరావు మాట్లాడుతూ.. మన్మధుడు తర్వాత అన్షు ఈ సినిమాలో నటించడం ఆనందంగా వుంది. అన్షు ఫారెన్ నుంచి వచ్చాక సన్నగా ఉందని.. ఇలా అయితే తెలుగుకు సరిపోరని.. కొంచెం మారాలని చెప్పా, పర్లేదు ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది అని డబుల్ మీనింగ్ వచ్చేలా అసభ్యకరంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని.. ఆయన మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ విషయం ఇప్పుడు మహిళా కమిషన్ దృష్టికి వెళ్లింది.
ఈ వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో త్రినాధరావు స్పందించారు.. మహిళలందరికీ క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు.. ‘‘అందరికీ నమస్కారం ముఖ్యంగా మహిళలకి, అన్షు గారికి, నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ నా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను.. నా ఉద్దేశ్యం ఎవరిని బాధ కలిగించడం కాదు.. తెలిసి చేసినా.. తెలియకుండా చేసిన తప్పు తప్పే.. మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను.’’ అంటూ వీడియోను షేర్ చేశారు.