నిర్మాతతో విబేధాలు.. స్పందించిన 'ఓజీ’ దర్శకుడు

పవన్ కళ్యాణ్ 'ఓజీ’ చిత్ర దర్శకుడు సుజీత్‌, నిర్మాత డీవీవీ దానయ్య మధ్య విభేదాలు తలెత్తాయంటూ గత కొంతకాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారానికి సుజీత్ తన సోషల్ మీడియా పోస్టుతో ఫుల్‌స్టాప్ పెట్టారు.

By -  Medi Samrat
Published on : 21 Oct 2025 9:00 PM IST

నిర్మాతతో విబేధాలు.. స్పందించిన ఓజీ’ దర్శకుడు

పవన్ కళ్యాణ్ 'ఓజీ’ చిత్ర దర్శకుడు సుజీత్‌, నిర్మాత డీవీవీ దానయ్య మధ్య విభేదాలు తలెత్తాయంటూ గత కొంతకాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారానికి సుజీత్ తన సోషల్ మీడియా పోస్టుతో ఫుల్‌స్టాప్ పెట్టారు. నిర్మాత దానయ్యకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఓజీ సినిమా గురించి బయట చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటారు. కానీ ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభం నుంచి ముగింపు వరకు నడిపించడానికి ఏం అవసరమో కొందరికి మాత్రమే అర్థమవుతుంది. ఆ విషయంలో నన్ను నమ్మి, నాకు అండగా నిలిచిన నా నిర్మాత దానయ్య గారికి, నా టీమ్‌కు మాటల్లో చెప్పలేనంతగా రుణపడి ఉంటాను’’ అని సుజీత్ తన పోస్టులో వివరించారు.

సుజీత్ తన తదుపరి చిత్రాన్ని హీరో నానితో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపైనే చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ, కొద్ది రోజుల క్రితం ఈ ప్రాజెక్ట్ నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై లాంఛనంగా ప్రారంభమైంది. దీంతో సుజీత్‌కు, దానయ్యకు మధ్య విబేధాలు రావడంతోనే నిర్మాణ సంస్థ మారిందనే వార్తలు వచ్చాయి.

Next Story