రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ శంకర్ కుమార్తె

2024 సంవత్సరంలో అటు ప్రొఫెషనల్ లైఫ్ లోనూ.. ఇటు పర్సనల్ లైఫ్ లోనూ డైరెక్టర్ శంకర్ కు మంచి సంవత్సరమే..

By Medi Samrat
Published on : 16 April 2024 10:00 AM IST

రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ శంకర్ కుమార్తె

2024 సంవత్సరంలో అటు ప్రొఫెషనల్ లైఫ్ లోనూ.. ఇటు పర్సనల్ లైఫ్ లోనూ డైరెక్టర్ శంకర్ కు మంచి సంవత్సరమే!! ఆయన దర్శకత్వం వహించిన కమల్ హాసన్ ఇండియన్ 2, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ విడుదలకు సిద్ధమవుతూ ఉన్నాయి. ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య ఇటీవల చెన్నైలో తరుణ్ కార్తికేయన్‌ను వివాహం చేసుకుంది. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి తమిళ ప్రముఖులు హాజరైన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏప్రిల్ 15న జరిగిన వేడుకకు నయనతార, విఘ్నేష్ శివన్, మణిరత్నం కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకర్, ఆయన భార్య ఈశ్వరి ఎంతో ఆనందంగా కనిపించారు. ఐశ్వర్య చెల్లెలు అదితి శంకర్ తన సోదరితో కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఐశ్వర్య శంకర్ పెద్ద కుమార్తె.. వృత్తిరీత్యా డాక్టర్ కూడా. క్రికెటర్ దామోదరన్ రోహిత్‌తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు ఇది రెండో పెళ్లి. 16 ఏళ్ల బాలిక దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో దామోదరన్ పేరు రావడంతో పోక్సో చట్టం కింద అభియోగాలు మోపారు.

Next Story