ద్రౌప‌ది ముర్ముపై మ‌రోసారి వ‌ర్మ ట్వీట్

Director Ram Gopal Varma tweets again on Droupadi Murmu.సినిమాల‌తో కంటే వివాదాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తుంటాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jun 2022 4:07 AM GMT
ద్రౌప‌ది ముర్ముపై మ‌రోసారి వ‌ర్మ ట్వీట్

సినిమాల‌తో కంటే వివాదాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తుంటాడు ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. త‌న‌కు సంబంధం లేని విష‌యాల్లో సైతం త‌ల‌దూర్చుతుంటాడు. ప్ర‌స్తుతం దేశంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక పై చ‌ర్చ న‌డుస్తుంది. ఎన్డీయే అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము, ప్ర‌తిప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

కాగా మొన్న వ‌ర్మ‌.. ద్రౌప‌ది ముర్ము పై చేసిన ట్వీట్ వివాదాస్ప‌దంగా మారిన సంగ‌తి తెలిసిందే. ద్రౌపది సరే.. పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు? అంటూ వ‌ర్మ ట్వీట్ చేయ‌గా.. దీనిపై బీజేపీ నాయ‌కుల‌తో పాటు నెటీజ‌న్లు మండిప‌డ్డారు. కొంత మంది పోలీస్ స్టేష‌న్‌లో వ‌ర్మ‌పై కేసు కూడా పెట్టారు. ఈ క్ర‌మంలో న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన వ‌ర్మ‌.. తాను ఉద్దేశపూర్వకంగా అలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చాడు. ఇప్పుడు మ‌ళ్లీ మరోసారి ద్రౌపది ముర్ము పై వ‌ర్మ ట్వీట్ చేశాడు.

'గౌరవనీయులైన ద్రౌపది జీపై నేను విస్తృతమైన పరిశోధన చేశాను. ఆ పరిశోధనలో ఆమె కళ్ల తీవ్రత, ఆమె చిరునవ్వు మరియు ముఖ రూపురేఖలు, వాటిని చూస్తే అర్థమైపోతుంది.. ఆమె ప్రపంచం మొత్తంలో గొప్ప రాష్ట్రపతి అవుతారు. ఆమె స్మైల్ చూస్తే హార్ట్ లోంచి వచ్చినట్టు ప్యూర్ గా ఉంది. కౌరవులు, పాండవులు పక్కనపెడితే ఈ ద్రౌపదిని అందరూ కలిసి గెలిపించుకొని కొత్త మహాభారతం రాస్తారు. థ్యాంక్యూ బీజేపీ' అంటూ వ‌ర్మ ట్వీట్ చేశాడు.

Next Story
Share it