గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు.. వ‌ర్మ వ‌రుస ట్వీట్లు

Director Ram Gopal Varma. ఇటీవ‌ల‌ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, మెగాస్టార్ చిరంజీవి వ్య‌వ‌హారం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

By Medi Samrat  Published on  10 Oct 2022 10:17 PM IST
గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు.. వ‌ర్మ వ‌రుస ట్వీట్లు

ఇటీవ‌ల‌ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, మెగాస్టార్ చిరంజీవి వ్య‌వ‌హారం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలాయ్ బలాయ్ కార్య‌క్ర‌మంలో ఇరువురు పాల్గొన్నారు. కార్యక్ర‌మంలో భాగంగా గరికపాటి ప్రసంగం ప్రారంభిస్తున్న సమయంలో కార్యక్రమానికి విచ్చేసిన ప‌లువురు చిరంజీవితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. ఈ క్ర‌మంలో గరికపాటి ఏం చెబుతున్నారో వినిపించుకునే పరిస్థితిలో ఎవ‌రూ లేరు. అస‌హ‌నంతో ఆయన కాస్త కటువుగా వ్య‌వ‌హ‌రించారు. మీరు ఫోటో సెషన్ ఆపకపోతే తాను ప్రసంగించడం ఆపేస్తానని మైకు వదిలేసి వెళ్లిపోవడానికి తనకు ఎలాంటి మొహమాటం లేదని గరికపాటి అన్నారు.

అనంత‌రం.. చిరంజీవి లాంటి ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గురించి నేను ఆ విధంగా మాట్లాడి ఉండాల్సింది కాదని గరికపాటి ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. ఈ విష‌యంపై మొద‌ట సెటైరిక‌ల్‌గా స్పందిచిన‌ మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు.. ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే.. అని కామెంట్ చేశారు.

అనంత‌రం.. గరికపాటి వారు ఏదో మూడ్ లో ఆలా అనివుంటారు ,అయన లాంటి పండితుడు ఆలా అనివుండకూడదని అయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప ,ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు.ఏది ఏమైనా మన మెగాభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని ఆయనని ఎవరు తప్పుగా మాట్లాడవద్దని మెగాభిమానులకు నా రిక్వెస్ట్ అంటూ ట్వీట్ విసిరారు.

ఇక ఈ విష‌యం చ‌ల్లారింది అనుకుంటుండ‌గా.. డైరెక్ట‌ర్ వివాదాల వ‌ర్మ వ‌రుస ట్వీట్లు చేస్తూ మ‌రోమారు చ‌ర్చ‌కు తెర‌లేపారు.

రామ్ గోపాల్ వ‌ర్మ వ‌రుస‌గా.. సర్ నాగాబాబు గారు, మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి , దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కాని అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరని నాగ‌బాబు ట్వీట్‌ను టాగ్ చేస్తూ వ‌రుస ట్వీట్లు చేశారు.







Next Story