డాక్టర్‌ను వివాహ‌మాడిన టాలీవుడ్‌ డైరెక్ట‌ర్‌

గ‌మ్యం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న‌ దర్శకుడు క్రిష్ మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.

By Medi Samrat  Published on  11 Nov 2024 9:15 PM IST
డాక్టర్‌ను వివాహ‌మాడిన టాలీవుడ్‌ డైరెక్ట‌ర్‌

గ‌మ్యం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న‌ దర్శకుడు క్రిష్ మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. డాక్టర్ ప్రీతి చల్లాను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. క్రిష్-డాక్టర్ ప్రీతి చల్లా పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వీరి పెళ్లి నిరాడంబరంగా.. కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరిగినట్టు తెలుస్తోంది.

క్రిష్‌ను వివాహ‌మాడిన‌ డాక్టర్ ప్రీతి చల్లా హైదరాబాదులో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. క్రిష్-ప్రీతిల వివాహ రిసెప్షన్ నవంబరు 16న జరగనున్నట్టు తెలుస్తోంది. క్రిష్‌కు గతంలో పెళ్లి కాగా.. మొదటి భార్య డాక్టర్ రమ్యతో విడాకులయ్యాయి. క్రిష్ గ‌మ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి, ఎన్.టి.ఆర్. కథానాయకుడు, ఎన్.టి.ఆర్. మహానాయకుడు, మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ, కొండపొలం చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క్రిష్ ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తున్న‌ హరి హర వీరమల్లు సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

Next Story